‘మన్‌ కీ బాత్‌’కు మూడు నెలల విరామం : ప్రధాని

Feb 25,2024 15:04 #Mann Ki Baat, #PM Modi

న్యూఢిల్లీ :   లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా మూడు నెలల పాటు మన్‌కీ బాత్‌ ప్రసారం ఉండదని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఆదివారం మన్‌కీబాత్‌ 110వ ఎపిసోడ్‌లో ప్రధాని మాట్లాడారు. మార్చిలో కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చే అవకాశం ఉందని, వచ్చే నెల ఎన్నికలలో షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఇది ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కార్యక్రమం అని ప్రధాని అన్నారు.

ఇప్పటివరకు నిర్వహించిన 110 ఎపిసోడ్‌లు ప్రభుత్వంతో ఎటువంటి ప్రమేయం లేకుండా నిర్వహించామని అన్నారు. దేశ సామూహిక శక్తి, విజయానికి ఈ ప్రసారం అంకితం’ అని పేర్కొన్నారు. ఇది ప్రజల కార్యక్రమమని, ప్రజల కోసం ప్రజలచే రూపుదిద్దుకుందన్నారు. తదుపరి నిర్వహించేది 111వ ఎపిసోడ్‌ అని.. ఈ సంఖ్యకు విశిష్టత ఉందన్నారు. ఇంతకంటే గొప్ప విషయమేముంటుందని చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమానికి విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే.

➡️