Noida: నోయిడాలో అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. నోయిడాలోని సెక్టార్‌ 100లోని లోటస్‌ బౌలేవార్డ్‌ సొసైటీలోని ఓ ఫ్లాట్‌లో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందిత ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఫ్లాట్‌లో ఎయిర్‌ కండీషనర్‌ పేలడం వల్ల మంటలు చెలరేగాయని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

➡️