పార్లమెంట్‌ భద్రతా వైఫల్య ఘటనపై స్పందించిన ప్రధాని మోడీ

Dec 17,2023 15:04 #Parliament, #PM Modi

న్యూఢిల్లీ  :    పార్లమెంట్‌ భద్రతా వైఫల్య ఘటనపై ప్రధాని మోడీ   మొదటిసారి స్పందించారు. ఈ ఘటన చాలా తీవ్రమైనదని అన్నారు. దీనిపై చర్చ అవసరం లేదని, సమగ్ర విచారణ జరగాలని ఆయన అన్నారు. ఆదివారం   ‘దైనిక్‌ జాగరణ్‌ ’ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మాట్లాడుతూ.. ఇది చాలా తీవ్రమైన అంశమని అన్నారు. స్పీకర్‌ తగిన చర్యలు తీసుకుంటున్నారని, దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతున్నాయని అన్నారు. దీని వెనుక ఉన్న కుట్రలు, వాటి లక్ష్యాలు తెలుసుకోవడం ముఖ్యమని అన్నారు. చర్చ అవసరం లేదని, సమగ్ర విచారణ జరగాలని చెప్పారు.

లోక్‌సభలో జరిగిన భద్రతా వైఫల్యంపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. అయితే లోక్‌సభలో భద్రత సెక్రటేరియట్‌ పరిధిలో ఉందని, కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం ఉండదని స్పీకర్‌ ఓం.బిర్లా పేర్కొనడం గమనార్హం.

➡️