9న రాజ్యసభ ప్రివిలేజ్‌ కమిటీ భేటీ

  •  ఎంపిల సస్పెన్షన్‌పై చర్చ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో  :   రాజ్యసభ ప్రివిలేజెస్‌ కమిటీ సమావేశం ఈ నెల 9న ఎంపి హరివంశ్‌ అధ్యక్షతన జరగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో 11 మంది ఎంపిల సస్పెన్షన్‌కు సంబంధించిన కేసుతో సహా పలు అంశాలపై కమిటీ నిర్ణయం తీసుకోనున్నది. శీతాకాల సమావేశాల్లోనే 46 మంది సభ్యులను రాజ్యసభ నుంచి కూడా సస్పెండ్‌ చేయడం తెలిసిందే. ఇందులో 11 మందిపై సభ ప్రివిలేజ్‌ కమిటీకి పంపారు. ఈ కమిటీకి డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ నేతృత్వం వహించనున్నారు. సస్పెన్షన్‌ వ్యవహారంపై రాజ్యసభ కమిటీ సమావేశం ఇంకా పెండింగ్‌లో ఉంది. ప్రివిలేజ్‌ కమిటీ నివేదిక వచ్చే వరకు ప్రతిపక్ష పార్టీల ఎంపిలు జెబి మాథర్‌ హిషామ్‌, హనుమంతయ్య, నీరజ్‌ డాంగి, రాజమణి పటేల్‌, కుమార్‌ కేత్కర్‌, జిసి చంద్రశేఖర్‌, బినోరు విశ్వం, సంతోష్‌ కుమార్‌, ఎం మహ్మద్‌ అబ్దుల్లా, జాన్‌ బ్రిట్టాస్‌, ఎఎ రహీం సస్పెండయ్యారు.

➡️