పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. లోక్ సభలోకి చొరబడ్డ దుండగులు

Dec 13,2023 13:31 #Delhi, #Parliament
  •  లోక్ సభలోకి టియర్ గ్యాస్ వదిలిన ఆగంతకులు 

ఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల వేళ లోక్ సభలో కలకలం రేగింది. లోక్ సభలోకి ఇద్దరు ఆగంతుకులు చొరబడ్డారు. సభలో టియర్ గ్యాస్ వదిలి భయాందోళనలను సృష్టించారు. ఈ గందరగోళంతో ఎంపీలు భయపడి పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. లోక్ సభ సెక్యూరిటీ వైఫల్యం వల్లే దుండగులు లోపలికి ప్రవేశించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విజిటర్స్ గ్యాలరీ నుంచి సభ్యుల మధ్యలోకి దూకి ముందుకు దూసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. ఈ అనూహ్య పరిణామంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. 2001లో సరిగ్గా ఇదే రోజున పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. మళ్లీ ఇదే రోజున తాజా ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

➡️