అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు భారతీయులు మృతి

Apr 27,2024 13:29 #America, #Fatal road accident

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంద. ఈ ప్రమాదంలో గుజరాత్‌కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. వీరి కారు సౌత్‌ కరోలినాలోని గ్రీన్‌విల్లే కౌంటీలోని బ్రిడ్జ్‌ మీదకు రాగానే అదుపు తప్పి బ్రిడ్జి మీద నుంచి 20 అడుగుల పైకి ఎగిరి ఎదురుగా ఉన్న చెట్లను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చీఫ్‌ డిప్యూటీ కరోనర్‌ మైక్‌ ఎల్లిస్‌ మీడియాకు వెల్లడించారు. ఈ ఘటనలో గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాకు చెందినటువంటి రేఖాబెన్‌ పటేల్‌, సంగీతాబెన్‌ పటేల్‌, మనీషాబెన్‌ పటేల్‌ మృతి చెందారని.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

➡️