ఐలు అఖిల భారత అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా వికాస్‌రంజన్‌ భట్టాచార్య, పివి సురేంద్రనాథ్‌

  • వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గాఎస్‌.రాజేంద్ర ప్రసాద్‌
  • 169 మందితో కేంద్ర కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
  • ఏపి భూ యాజమాన్య చట్టం రద్దు చేయాలని తీర్మానం
  • ముగిసిన 14వ ఐలు మహాసభ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) అఖిల భారత నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గా వికాస్‌రంజన్‌ భట్టాచార్య, పివి సురేంద్రనాథ్‌ ఎన్నికయ్యా రు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుంకర రాజేంద్ర ప్రసాద్‌, కోశాధి కారిగా అనిల్‌ కుమార్‌ చౌహాన్‌ ఎన్నికయ్యారు. పశ్చిమ బెంగాల్‌ హౌరా నగరంలోని అశోక్‌ వికాష్‌ మంచ్‌, నారాయణ్‌ గుప్తా నగర్‌లో మూడు రోజుల పాటు జరిగిన ఐలు 14వ అఖిల భారత మహాసభ శనివారం ముగిసింది. ‘మతోన్మాదంపై పోరా టం, రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’ నినాదంతో జరిగిన ఈ మహాసభకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 600 మంది ప్రతినిధులు హాజరయ్యారు. మహాసభ 169 మందితో నూతన కేంద్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అందులో 81 మందితో సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, 34 మందితో కార్యవర్గం ఎన్నికైంది. 34 మంది కార్యవర్గ సభ్యుల్లో 14 మందిని ఉపాధ్యక్షులుగా, 20 మందిని సహాయ కార్యదర్శులుగా ఎన్నుకున్నారు.

అనిల్‌ కుమార్‌ చౌహాన్‌
అనిల్‌ కుమార్‌ చౌహాన్‌

కేంద్ర కమిటీలోకి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నిక

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సుంకర రాజేంద్ర ప్రసాద్‌, సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా నర్రా శ్రీనివాసరావు, వై.రమేష్‌, కేంద్ర కమిటీ సభ్యులుగా సంపర దుర్గాప్రసాద్‌ (విజయవాడ), ఎస్‌.రమేష్‌ బాబు (విజయవాడ), ఎస్‌.అంకయ్య (నెల్లూరు), కె.విజరు కుమార్‌ (కర్నూల్‌), వి.శైలజ (పశ్చిమ గోదావరి) ఎన్నికయ్యారు.తెలంగాణ నుంచి… ఉపాధ్యక్షులుగా కొల్లి సత్యనారా యణ, కేంద్ర కమిటీ సభ్యులుగా జి.విద్యా సాగర్‌, కె.పార్థసారధి, వి.వేణుగోపాల్‌, రామచంద్రారెడ్డి, బి. చంద్రశేఖర్‌ ఆజాద్‌, సిహెచ్‌ శైలజ, వై.శ్రీనివాసరావు, జె.శివరామప్రసాద్‌, నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.

సుంకర రాజేంద్ర ప్రసాద్‌
సుంకర రాజేంద్ర ప్రసాద్‌

ఎపి భూ యాజమాన్య చట్టం రద్దు చేయాలని తీర్మానం

ఎపి భూ యాజమాన్య చట్టం రద్దు చేయాలని ఐలు 14వ అఖిల భారత మహాసభ తీర్మానించింది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, న్యాయవాదులకు సంబంధించిన అంశాలపై దాదాపు 15 తీర్మానాలు ఆమోదించారు.

➡️