మార్చి 30 నుంచి ఏపీ డీఎస్సీ పరీక్షలు

Mar 12,2024 16:04 #ap dsc exams, #sedule

అమరావతి: ఏపీలో ఉపాధ్యాయ నియామక పరీక్షలు (టీఆర్‌టీ-డీఎస్సీ) మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు జరగనున్న విషయం తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎస్జీటీ) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 7న ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ప్రిన్సిపల్‌ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 13 నుంచి ఏప్రిల్‌ 30 వరకూ స్కూల్‌ అసిస్టెంట్‌, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్‌, ప్రిన్సిపల్‌ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి. ఈనెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకొనేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నారు. 25 నుంచి హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు.

➡️