24thDay: అలుపెరగని అంగన్వాడీల పోరాటం

anaganwadi workers strike 24th day

ప్రజాశక్తి-యంత్రాంగం : నిర్బంధాలకు, బెదిరింపులకు భయపడేది లేదని, తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగిస్తామని తేల్చి అంగన్‌వాడీలు చెప్పారు. గురువారంతో వారి సమ్మె 24వ రోజుకు చేరుకుంది.  బుధవారం కలెక్టరేట్ల బైటాయింపు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి పోలీసులు నిర్బంధాన్ని ప్రయోగించారు. పలు జిల్లాల్లో అరెస్టులకు పాల్పడ్డారు.  అనేక విధాల నిర్బంధాన్ని అధిగమించి కలెక్టరేట్ల వద్దకు చేరుకొని వేలాది మంది అంగన్‌వాడీలు బుధవారం బైటాయించి, నినాదాలతో కలెక్టరేట్లు హోరెత్తాయి. పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.

విజయనగరంలో అమ్మోరు రూపంలో అంగన్వాడీల వినూత్న నిరసన
రాంబిల్లిలో అంగన్వాడీల నిరసన
కందులపురం సెంటర్‌లో అంగన్వాడీల దీక్షా
కలెక్టర్ జారీ చేసిన మెమోను దగ్ధం చేస్తున్న కోటబొమ్మలి అంగన్వాడీ కార్యకర్తలు
నియోజకవర్గ పరిధిలోని రొల్ల మండలం తాసిల్దార్ కార్యాలయంలో అంగన్వాడీల ధర్నా
పెద్దవడుగూరు మండలంలో అంగన్వాడీల మానవహారం

భోగాపురంలో మహిళా కానిస్టేబుల్ యూనియన్ లీడర్ పట్ల అనుచిత వాఖ్యలు చేశారని పోలీస్ స్టేషన్లో బైఠాయించిన అంగన్వాడీ కార్యకర్తలు

భోగాపురం లో కదం తొక్కుతున్న అంగన్వాడీలు
అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ కి 24వ రోజు సమ్మెలో భాగంగా గురువారం టిడిపి యువ నాయకులు గెట్టి బోయిన మల్లికార్జున భోజనాలు ఏర్పాటు చేశారు.

anaganwadi workers strike 24th day atp

అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న అంగన్వాడీల కార్యకర్తల నిరవధిక సమ్మె

anaganwadi workers strike 24th day eg

  • 24వ రోజుకు చేరుకున్న అంగన్వాడి సమ్మె

తూగో – చాగల్లు : మండల కేంద్రమైన చాగల్లు  తహసీల్దార్ కార్యాలయం వద్ద  అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరవధికసమ్మె గురువారం నాటికి 24వ రోజుకి చేరుకొంది. ఈ సందర్భంగా దీక్ష శిబిరంలో గౌరవ వేతనం మాకొద్దు కనీస వేతనం మాకు కావాలంటూ నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యూటీ, ఐసీడీఎస్ ప్రీస్కూల్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి విజయ్ కుమారి కే లక్ష్మి కే దమయంతి ఏ శ్రీదేవి బి మహాలక్ష్మి ఎస్ అరుణ్ కుమారి అంగన్వాడి కార్యకర్తలు పాల్గొన్నారు

అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా 24వ రోజు గురువారం ఏలూరు కలెక్టరేట్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపిన అంగన్వాడీలు

 

ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

 

anaganwadi workers strike 24th day mylavaram

  • బెనికిన చెయ్యితో రాస్తారోకో

ఎన్టీఆర్ జిల్లా-మైలవరం : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈనెల మూడో తేదీన కలెక్టరేట్ ముట్టడికి సిఐటియు పిలుపునిచ్చింది. ముట్టడిని పురస్కరించుకొని సిపిఎం, సిఐటియు, అంగన్వాడీల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి సెంట్రల్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పివి ఆంజనేయులు మాట్లాడుతూ మహిళలని చూడకుండా పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ టి యు, రైతు సంఘం, అంగన్వాడీలు, అంగన్వాడి హెల్పర్లు, కౌలు రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు.

➡️