అంగన్‌వాడీల సమ్మె ఉధృతం

Dec 13,2023 21:58 #Anganwadi Workers, #strike
anganwadi protest 2nd day

-వినూత్న రీతిలో నిరసనలు

-హోరెత్తిన కలెక్టరేట్లు

ప్రజాశక్తి- యంత్రాంగం : అంగన్‌వాడీల సమ్మె ఉధృతమైంది. ప్రభుత్వ అవాస్తవ ప్రకటనలో వారిలో మరింత పట్టుదల పెరిగింది. రెండో రోజు బుధవారం కలెక్టరేట్లు, ఐసిడిఎస్‌ కార్యాలయాలు, మండల కేంద్రాల్లో ఆందోళనలను తీవ్రతరం చేశారు. వీటిలో పెద్ద ఎత్తున అంగన్‌వాడీలు పాల్గనడంతో ఆయా ప్రాంతాలు హోరెత్తాయి. పలు జిల్లాల్లో వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించడంతోపాటు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అనంతపురం, శ్రీసత్యసాయి, గుంటూరు తదితర జిల్లాల్లో అంగన్‌వాడీ టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలు చట్టిబిడ్డలతో సహా దీక్షల్లో పాల్గన్నారు. తమ బతుకులు చీకటిలో ఉన్నాయంటూ, రాష్ట్ర ప్రభుత్వం మనసు మారి సమస్యలు పరిష్కరించాలంటూ పార్వతీపురంలో అంగన్‌వాడీలు దీపోత్సవం నిర్వహించి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. అల్లూరి సీతారామరాజు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల ఐసిడిఎస్‌ కార్యాలయం వద్ద వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. అమలాపురరలో కలెక్టరేట్‌ వద్ద ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ, భీమడోలులో కళ్లు మూసుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. జంగారెడ్డిగూడెం, మండవల్లి, కలిదిండిల్లో అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు. బాపట్ల, చింతలపూడి, టి.నరసాపురంలో ర్యాలీ నిర్వహించారు. చీరాలలో మానవహారంగా ఏర్పడ్డారు. చిత్తూరులో మోకాళ్లపై నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పలువులు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, సిపిఎం, సిపిఐ, టిడిపి, బిఎస్‌పి, జనసేన, సిఐటియు, ఎఐటియుసి, ఇఎఫ్‌టియు, గిరిజన సంఘం, పలు ప్రజాసంఘాల నాయకులు సమ్మె శిబిరాలను సందర్శించి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

విచ్ఛిన్నం చేయాలని చూస్తే ఊరుకోం : సిహెచ్‌.నరసింగరావుఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడ ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీల సమ్మె శిబిరంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా దౌర్జన్యాలు, బెదిరింపులు, ఒత్తిడులతో సమ్మెను విచ్ఛిన్నం చేయాలనుకుంటే సిఐటియు చూస్తూ ఊరుకోదని, అన్ని సంఘాలనూ కలుపుకొని విశాల ఐక్యత ద్వారా సమ్మెను ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగున అంగన్‌వాడీలకు గ్రాట్యూటీ చెల్లిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు తీర్పును శిరసా వహించి అంగన్‌వాడీల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ మూడు మాసాల నుంచి వివిధ రూపాల్లో ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నా సమస్యల పరిష్కారానికి ముందుకు రానందునే అంగన్‌వాడీలు నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. శ్రామిక మహిళ రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్షి మాట్లాడుతూ తక్షణమే సమస్యలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో అంగన్‌వాడీల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. గుంటూరు కలెక్టరేట్‌ సమ్మె శిబిరంలో ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకొని అంగన్‌వాడీల డిమాండ్లను నెరవేర్చి సమ్మెను విరమింపజేయాలని కోరారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడితే భయపడేది లేదని, ప్రభుత్వం సానుకూలంగా స్పందించే వరకూ సమ్మె కొనసాగుతుందని తేల్చి చెప్పారు. పెదకాకాని, మంగళగిరిలో శిబిరాలను కూడా ఆమె సందర్శించి మద్దతు తెలిపారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మాట్లాడుతూ అంగన్‌వాడీల సమస్యలను సామరస్యంగా పరిష్కరించాల్సిందిపోయి అంగన్‌వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం వంటి చర్యలకు పూనుకోవడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శమని విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో అంగన్‌వాడీలో సమ్మె శిబిరంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.రాంభూపాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకపోగా అధికారులతో బెదిరింపులకు దిగడం తగన్నారు. అంగన్‌వాడీల సమ్మె శిబిరాలను రాజమహేంద్రవరంలో టిడిపి ఎంఎల్‌ఎ గోరంట్ల బుచ్చియ్య చౌదరి, పశ్చిమగోదావరి జిల్లా కాళ్లలో ఉండి ఎంఎల్‌ఎ మంతెన రామరాజు, విజయవాడలో ఆవాజ్‌ రాష్ట్ర కార్యదర్శి శిష్టి, అల్లూరి జిల్లా అరకులోయలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర తదితరులు సందర్శించి మద్దతు పలికారు.

eg anganwadi protest 2nd day
అంగన్వాడీల సమ్మెతో 2వ రోజు దద్దరిల్లిన కలెక్టరేట్

సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు

జనసేన, టిడిపి, పలు సంఘాల మద్దతు

రాజమహేంద్రవరం(తూగో): రాష్ట్రంలో అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరింది. జిల్లావ్యాప్తంగా అంగన్వాడి మూత వేసి బొమ్మూరులో గల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్దకు అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పెద్ద ఎత్తున 3000 మంది చేరుకున్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే తప్ప సమ్మె విరమించేది లేదని పెద్ద ఎత్తున నినదించారు. రాజనగరం రూరల్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ధర్నా శిబిరం వద్దకు విచ్చేసి తన మద్దతును తెలిపారు. జగన్ ప్రభుత్వం ఎన్నికల ముందు తెలంగాణ కంటే అదనంగా ఒక వెయ్యి రూపాయలు ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని. రాష్ట్రంలో ఉద్యోగులకు, కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాడని, ఎన్నికల ముందుఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేకుంటే రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వం అమలకు ఫోన్ కొంటామని అన్నారు, జనసేన రాజనగరం నియోజకవర్గ కోఆర్డినేటర్ బత్తుల బలరామకృష్ణ సంఘీభవం తెలిపి మాట్లాడుతూ అంగన్వాడీలకు వేతనాలు పెంచని ప్రభుత్వం సంక్షేమ పథకాలను కూడా నిలిపివేసిందని, రాష్ట్రంలో మళ్లీ జగనే రావాలని ప్రచారం జరుగుతుందని, చిరుద్యోగులకు, స్కీం వర్కర్లకు తీవ్ర అన్యాయం చేసిన జగన్ మళ్ళీ ఎందుకు రావాలని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు జనసేన పార్టీ మీ వెంట ఉంటుందని, పోరాటంలో భాగస్వామ్యం అవుతామని అన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం మరో మూడు నెలల్లో ఎన్నికలకు పోతున్న సమయంలో సైతమ్ అంగన్వాడీల సమస్యలు పరిష్కారంలో నేను మీసాలు ఎక్కిస్తుందని విమర్శించారు. గత ఎన్నికల్లో జగన్ని ముఖ్యమంత్రిగా చేసింది అంగన్వాడీలు స్కీం వర్కర్లు అన్న సంగతి మరువద్దని హితవు పలికారు. ఉద్యోగులు,కార్మికులు,ఉపాధ్యాయులు, మధ్యతరగతి ప్రజలు అందరి పైన తీవ్ర భారాలు మోపి, కనీసం వారికిచ్చే వేతనాలు పెంచే విషయంలో కనీసం కనికరంలేకుండా రాష్ట్ర ప్రభుత్వం మేకపోతు గాంభీర్యం నటిస్తుందని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమానికి ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కే పోచమ్మ, జిల్లా ట్రెజరర్ ఎం వెంకటలక్ష్మి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి జువ్వల రాంబాబు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం రాజా,ఐద్వా జిల్లా అధ్యక్షులు ఏ జరిన షరీఫ్, సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం సుందర్ బాబు,బి రాజులోవ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ ఎస్ మూర్తి, కర్రీ రామకృష్ణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కార్యదర్శులు మాణిక్యంబ, కె. బేబీరాణి ధర్నా శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కే అన్నామని, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు భాస్కర్, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్ట్ ల అధ్యక్ష కార్యదర్శులు మాలతి, సుబ్బలక్ష్మి, బి. మార్త, దుర్గంబ,మార్త సుజాత, శారదా, సునీత,పుష్ప, రామాలక్ష్మి, టి.బి. లక్ష్మి పాల్గొన్నారు.

karamchedu anganwadi protest 2nd day
కారంచేడులో అంగన్వాడీల ధర్నా
బాపట్ల-కారంచేడు : సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల నిరవధిక సమ్మె సందర్భంగా బుధవారం కారంచేడు మండల కార్యాలయం వద్ద ధర్నా చేశారు. కారంచేడు తాసిల్దార్ వెంకటరత్నం కు వినతిపత్రం ఇచ్చారు. అంగన్వాడి కార్యకర్తలకు కనీస వేతనాలు ఇవ్వాలని, వాటిని అమలు జరపాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పెన్షన్ ఇవ్వాలని, అంగన్వాడి సెంటర్లకు నాణ్యమైన పౌష్టికాహార సరుకులు సరఫరాచేయాలని, ప్రమోషన్లకు వయోపరిమితి సడలించాలని, అంగన్వాడీల సమస్యలన్నింటినీ పరిష్కరించాలని జరుగుతున్న సమ్మెను సమస్యలు పరిష్కరించే విరమింపజేయాలని డిమాండ్ చేశారు. కారంచేడు మండల వద్ద ధర్నా జరిగింది ఏం మండల తాసిల్దార్ కి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పి కొండయ్య ,అంగన్వాడి యూనియన్ నాయకులు పి అనిత, శ్రీలక్ష్మి ,మేరీ ,మరియమ్మ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

anganwadi protest 2nd day konaseema mandapeta
మండపేటలో 2వ రోజుకు అంగన్వాడీల సమ్మె
కోనసీమ – మండపేట : తమ డిమాండ్ల సాధన లక్ష్యంగా స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె
బుధవారం నాటికి రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆరు రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో అమలు చేయకపోవడం దౌర్భాగ్యం అన్నారు. అంగన్వాడీలకు పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, పనిభారం తగ్గించాలని, ఆయాలకు ప్రమోషన్ వయస్సు 50 సంవత్సరాలకు పెంచాలని తదితర అంశాలపై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

akp anganwadi protest 2nd day
అంగన్వాడీల సమ్మెకు పూర్తి మద్దతు తెలిపిన తెలుగుదేశం మాజీ శాసనసభ్యుడు గవిరెడ్డి రామానాయుడు
అనకాపల్లి – మాడుగుల: రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు తమ సమస్యలపై ప్రారంభించిన సమ్మెకు గవిరెడ్డి రామానాయుడు పూర్తి మద్దతు పలికారు. బుధవారం మాడుగుల నియోజకవర్గ కేంద్రం బస్టాండ్ ఆవరణలో చీడికాడ మాడుగుల ఆంధ్రప్రదేశ్ అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మెలో రామానాయుడు పాల్గొని ప్రసంగించారు.

gnt anganwadi protest 2nd day pdf mlc
ఫిరంగిపురంలో అంగన్వాడిలను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు

gnt anganwadi protest 2nd day
గుంటూరు కలెక్టరేట్ ఎదుట రెండవ రోజు ఉదృతంగా సాగుతున్న అంగన్వాడీల సమ్మె

wg anganwadi protest 2nd day
పగో-తాడేపల్లిగూడెం: స్థానిక తసీల్దార్ కార్యాలయం వద్ద రెండవ రోజు ఐసిడిఎస్ ను బలోపేతం చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్  సిఐటియు పిలుపులో భాగంగా బుధవారం రెండో రోజు నిరాహార దీక్షలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు పట్టణ సీఐటీయూ నాయకులు కర్రి నాగేశ్వరరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కండెల్లి సోమారాజు, టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ వలవల బాబ్జి పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

krishna dist anganwadi protest 2nd day
కృష్ణా జిల్లా : తమ న్యాయమైన పరిష్కరించాలని కోరుతూ రెండు రోజులుగా అంగన్ వాడీ కార్యకర్తలు నిరవధిక సమ్మె చేయటంతో మండలంలోని అంగన వాడి కేంద్రంలు మూతపడ్డాయి. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈనెల 12వ తేదీ నుండి మొవ్వ ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న సమ్మెలో అంగన్వాడి కార్యకర్తలు అందరూ పాల్గొనడంతో కేంద్రాలు వెలవెల పోతున్నాయి. నిత్యం పిల్లలతో కళకళలాడుతూ ఉండే అంగన్వాడీ కేంద్రాలు మూతపడటంతో పిల్లలు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కారం జరిగే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.

anganwadi protest 2nd day vzm

కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న రెండో రోజు నిరసన దీక్ష
విజయనగరం టౌన్ : అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె బుధవారం నాటికి రెండో రోజుకి చేరుకుంది. రెండో రోజు జిల్లా కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరసన దీక్ష ప్రారంభమైంది. కలెక్టరేట్ వద్ద చేపట్టిన దీక్షకు విజయనగరం అర్బన్ ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు చేరుకుంటున్నారు.

tpt anganwadi protest 2nd day

బెదిరింపులకు భయపడం : అంగన్వాడీల హెచ్చరిక
తిరుపతి – పిచ్చాటూరు: పిచ్చాటూరు మండలం సిడిపిఓ కార్యాలయం ముందు బుధవారం రెండవ రోజు సమ్మెకు సంఘీభావంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు నాగలాపురం నాగరాజు, జె, రామచంద్రారెడ్డి లు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామంటూ బెదిరింపు లను మానుకోవాలని హెచ్చరించారు.అంగన్వాడీల చేస్తున్న వెట్టి చాకిరికి ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను ఆమోదించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ కన్నా అదనంగా వేతనం చెల్లిస్తామన్న ముఖ్యమంత్రి తమ హామీపై మడమ తిప్పకుండా, మాట తప్పకుండా విజ్ఞతగా వ్యవహరించాలని తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా కోశాధికారి రాజేశ్వరి, ప్రాజెక్టు నాయకురాలు ఇంద్రాణి మాట్లాడుతూ అంగన్వాడీలు చేస్తున్న న్యాయమైన పోరాటానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు .రాష్ట్ర ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదనివారు తేల్చి చెప్పారు .మా సమస్యల పట్ల ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటియు నాయకులు కృష్ణవేణి, కళ్యాణి, విజయ కుమారి, వీరమ్మ, సావిత్రి, పూర్ణమ్మ, ప్రమీల ,నాగభూషణమ్మ, భారతి, పద్మ, షఫియా, వర్కర్లు, హెల్పర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

anganwadi protest 2nd day sklm
రెండో రోజూ కొనసాగుతున్న సమ్మె
శ్రీకాకుళం : కనీస వేతనం రూ 26 వేలు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ చేపట్టిన సమ్మె శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజూ కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు మూత పడ్డాయి. పలు ప్రజా, కార్మిక సంఘాల నాయకులు సమ్మె శిబిరాలకు హాజరై సంఘభావం ప్రకటించారు. శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ వద్ద నిర్వహించిన దృణలో యూనియన్ జిల్లా అధ్యక్షులు కల్యాణి మాట్లాడుతూ తమ డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొన సాగిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకులు అల్లు సత్యనారాయణ, యూనియన్ నాయకులు టి రాజేశ్వరి, ప్రమీలదేవి తదితరులు పాల్గొన్నారు.


సమస్యల పరిష్కారం కోసం రెండో రోజుకి అంగన్వాడీలు సమ్మె
కాకినాడ ప్రతినిధి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చేపట్టిన నిర్వాదిక సమ్మె రెండో రోజు కొనసాగుతుంది. కాకినాడ ఇంద్ర పాలెం లాకులు వద్ద కాకినాడ అర్బన్, రూరల్, పెదపూడి, కరప మండలాలకు చెందిన అంగన్వాడీలు వందల సంఖ్యలో బుధవారం కూడా సమ్మె శిబిరానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ.చంద్రావతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి విడిచిపెట్టి న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీను అమలు చేయమని అడుగుతుంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు చర్చలకు పిలిచి బెదిరింపులకు దిగడం సరికాదన్నారు. శక్తికి మించి పనిచేస్తున్నా అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక అనేకమంది అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు సేవలు అందిస్తున్న తామంతా ఇబ్బందులకు గురవుతున్నామని, విధలేని పరిస్థితుల్లోనే ఈ సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు

kurnool anganwadi protest 2nd day
అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలి
కర్నూలు అగ్రికల్చర్ : అంగన్వాడీలకు వెంటనే వేతనాలు పెంచాలని శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ పి. నిర్మల ఏఐటియుసి జిల్లా కార్యదర్శి మునెప్ప జనసేనా పార్టీ నాయకులు హర్షద్,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాబూరావులు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. అంగన్వాడీల సమ్మె బుధవారం రోజు ధర్నా చౌక్ లో ఏఐటియుసి నగర కార్యదర్శి చంద్రశేఖర్ సిఐటియు నగర నాయకులు గోపాల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ గతంలో జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇప్పటికే వేతనాలు పెంచుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పెంచడం లేదని విమర్శించారు. వెంటనే అంగన్వాడీలకు కూడా పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత సంవత్సర కాలంగా అంగనవాడి ఉద్యోగులు డిమాండ్ల పై ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం చర్చల పేరుతో కాలయాపన చేస్తుందని వారు విమర్శించారు. అంగన్వాడి ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ కొనసాగించాలని పెన్షన్ రిటైర్డ్ అయ్యే సమయానికి ఉన్న జీతంలో సగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మినీ సెంటర్ల లను మైయిన్ సెంటర్లుగా మార్చాలని వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలని మినీ వర్కర్లకు కూడా ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు హెల్పర్స్ కు టీచర్స్ గా ప్రమోషన్ ఇవ్వడానికి వయోపరిమితిని 50 సంవత్సరాలకు పెంచాలని కోరారు. దీనిలో రాజకీయ జోక్యం అరికట్టాలని డిమాండ్ చేశారు ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేయాలని, అన్ని యాప్లను కలిపి ఒకే యాప్ గా మార్చాలని కోరారు. సర్వీసులో ఉండి మరణించిన అంగన్వాడీ టీచర్ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని కోరారు మిగిలిన డిమాండ్లు కూడా పరిష్కారం అయ్యేంతవరకు అంగన్వాడీ ఉద్యోగులు తమ పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు నరసింహులు నగర కార్యదర్శి విజయ్ నగరనాయకుల సుధాకరప్ప మహమ్మద్ రఫీ యేసు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు రేణుకమ్మ విజయభారతి అర్బన్ ప్రాజెక్టు నాయకురాలు బాలదుర్గమ్మ ఏఐటీయూసీ నాయకులు మల్లన్న అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు సునంద చౌడేశ్వరి రాధిక వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

anganwadi protest 2nd day ntr mylavaram
ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మొండివైఖరి వీడాలి

ప్రజాశక్తి-మైలవరం : రాష్ట్ర ముఖ్యమంత్రి అంగన్వాడీల సమస్యలపై మౌనం వేడాలి అధికారులతో చర్చించి వేతనాలు పెంచేందుకు తగిన నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో ఉద్యమం ఆగేది లేదని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్రవ్యాప్తంగా అంగనవాడి వర్కర్ల సమ్మెలో భాగంగా రెండవ రోజు మైలవరం సిడిపిఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘అంగన్వాడి అక్క చెల్లెమ్మలకు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గారి హామీ నీటి మీద రాతలు మిగిలిపోయింది.2022లో సుప్రీం కోర్టు అంగన్వాడీలకు కూడా గ్రాడ్యుటీ అమలు చేయాలని ఇచ్చిన తీర్పు నేటికీ మన రాష్ట్రంలో అమలు కావటం లేదు మినీ సెంటర్లను మెయిల్ సెంటర్లు గా మార్చలేదు హెల్పర్స్ ప్రమోషన్ కు ఎటువంటి నిబంధన రూపొందించలేదు సెంటర్ల నిర్వహణ కు అంగన్వాడీలు పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి నెట్టబడ్డాం అంగన్వాడీల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది సమస్యలపై మనం నిర్వహించిన ఆందోళనలపై తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. పోలీసులతో ముందస్తు అక్రమ అరెస్టులు చేయించి కేసులు పెట్టింది ఈ నేపథ్యంలో మన సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నేడు సమ్మె చేయాలని యూనియన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఈ సమ్మెలో లబ్ధిదారులు కార్మిక సంఘాలు ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలు అభ్యుదయ ప్రజాస్వామ్యవాదుల మద్దతుతో అంగన్వాడి వర్కర్ల హెల్పర్లు మినీ వర్కర్లు అందరు పాల్గొని జయప్రదం చేయాలని’ కోరారు.

anganwadi protest 2nd day sklm leader
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల : అంగన్వాడీల డిమాండ్లు పరిష్కారమయ్యే వరకు సమ్మె పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు, ఎపి అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు స్పష్టం చేసారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటి అమలు చేయాలని, సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజు కొనసాగింది. ఎచ్చెర్లలో జరిగిన ఆందోళనలో యుటిఎఫ్ రాష్ట్ర నాయుకులు ఎస్.కిషోర్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ ఆందోళనలో వారు మాట్లాడుతూ నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగినా గత నాలుగు సంవత్సరాలుగా వేతనాలు పెంచలేదని, రెగ్యులర్ ఉద్యోగుల మాదిరి డిఎ కూడా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాలతో జీవనం గడపడం కష్టంగా ఉంది. అంతే కాకుండా అంగన్వాడి సెంటర్ల నిర్వహణకు సంబంధించిన బిల్లులన్నీ సకాలంలో చెల్లించక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు. తెలంగాణా కంటే కనీసం వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి హామీ నెరవేరలేదని అన్నారు. 2022లోనే సుప్రీంకోర్టు అంగన్వాడీలకి గ్రాట్యూటీ అమలు చెయ్యాలని తీర్పునిచ్చినప్పటికీ మన రాష్ట్రంలో అంగన్వాడీలకి గ్రాట్యూటీ అమలు చెయ్యటంలేదని అన్నారు. గత 48 సం॥ల నుండి పనిచేస్తున్న అంగన్వాడీలు కనీసం సర్వీసులో ఉండి చనిపోతే మట్టి ఖర్చులు కూడా ఇవ్వటం లేదని అన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పధకాలు అమలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేసారు.అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకు వివిధ రకాల యాప్లు తెచ్చారని, ఫోన్లు పనిచెయ్యటంలేదని,ఏ ట్రైనింగ్ ఇవ్వటంలేదని, ఏజెన్సీ, మారు మూల ప్రాంతాల్లో నెట్ సిగ్నల్ ఉండటంలేదని తెలిపారు. దీని వలన అంగన్వాడీలు మానసిక వత్తిళ్లకు గురవుతున్నారని అన్నారు. అంగన్వాడీలు దశలవారీగా అనేక ఆందోళనలు చేయడం జరిగిందని, అధికారులతో చర్చలు జరిగినా సమస్యలు పరిష్కారం కాలేదని, ఈ పరిస్థితులలో సమస్యలు పరిష్కారం కోసం సెంటర్లని మూసివేసి నిరవధికంగా సమ్మెకు వెళ్ళడం జరిగిందని తెలిపారు. తక్షణమే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యూటీని రాష్ట్రంలో అమలు చేయాలని డిమాండ్ చేసారు. మినీ సెంటర్లన్ని తక్షణమే మెయిన్ సెంటర్లుగా మార్చాలని, మినీ వర్కర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. రిటైర్మెంట్ బెపిఫిట్ 5 లక్షలకు పెంచాలని, పెన్షన్ ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. హెల్పర్ల ప్రమోషన్లో రాజకీయజోక్యం అరికట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులు మాదిరి రిటైర్మెంట్ వయసును 62 సం॥కు పెంచాలని డిమాండ్ చేసారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలు పెంచాలని, గ్యాసును ప్రభుత్వమే సరఫరా చెయ్యాలని, పెండింగ్లో ఉన్న సెంటర్అద్దెలు, 2017 నుండి పెండింగ్‌లో ఉన్న టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని, లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దుచెయ్యాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ వై.విజయలక్ష్మి, శారద,కనకం, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

anganwadi protest 2nd day atp cpm
అనంతపురం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మెకు మద్దతు తెలుపుతున్న సిపిఎం నాయకులు రాంభూపాల్

anganwadi protest 2nd day alluri vr puram vsr 1


అల్లూరి జిల్లా కూనవరం, విఆర్ పురంలో అంగన్వాడీ కార్యకర్తల సమ్మె శిబిరాల వద్ద సంఘీభావం తెలియజేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

అంగన్వాడి కార్యకర్తలు ధర్నా మర్రిపాలెం జంక్షన్ దగ్గర

విశాఖ జిల్లా మర్రిపాలెం జంక్షన్ దగ్గర అంగన్వాడి కార్యకర్తలు ధర్నా

anganwadi protest 2nd day eluru collectorate
ఏలూరు జిల్లాలో అంగన్వాడీలపై బెదిరింపులకు దిగినటువంటి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, సమ్మెలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల భారీ ధర్నా…. మద్దతు తెలిపిన ఏలూరు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ బడేటి చంటి, జనసేన ఏలూరు అసెంబ్లీ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు.

anganwadi protest 2nd day manyam
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జ్ఞానోదయం కలిగించాలని కోరుతూ, దీపాలతో తెప్పలు వదులుతూ పార్వతీపురం జిల్లా కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ వినూత్న రీతిలో నిరసన.

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండల ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ముందు రెండోవ రోజు సమ్మెకు అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పార్స్ యూనియన్ మండల అధ్యక్షరాలు ఎస్.ఈశ్వరి అద్యక్షతన జరిగిన సభలో సంఘిబావం తెలిపడనికి వచ్చిన సర్వశిక్షా అభియాన్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏం.అనిల్ కుమార్, గౌరీ శంకర్


అన్నమయ్య జిల్లా రాయచోటలో అంగన్వాడి సమస్యల సాధన కోసం రెండో రోజు కొనసాగుతున్న సమ్మె


అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అంగన్వాడీల సమస్యల సాధన కోసం కొనసాగుతున్న రెండో రోజు సమ్మె

పెద్దాపురం ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిదిలో తూర్పుపాకల అంగన్ వాడీ వర్కర్ పోస్టు విషయం కోర్టులో ఉండగా కొత్తవారిని నియమించడానికి పెద్దాపురం ఆర్.డి.వో గారు, కాకినాడ జిల్లా పిడి గారు, పెద్దాపురం సిడిపివొ గారు ప్రయత్నం చేస్తే దానిని అంగన్ వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సిఐటియు)గా అడ్డుకోవడం జరిగింది.

anganwadi protest 2nd day kadapa pulivendula
తెలంగాణ రాష్ట్రం మాదిరిగానే అంగన్వాడీలకు వేతనం అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ కడప జిల్లా పులివెందుల టౌన్ తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలు బైఠాయించి నిరవధిక సమ్మె చేశారు.

anganwadi protest 2nd day chittoor v kota
చిత్తూరు జిల్లా వి కోటలో తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా రెండవ రోజు మండల కేంద్రమైన వీకోటలోని తాసిల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు నిరసన

anganwadi protest 2nd day chittoor v kota
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండల కార్యాలయం ప్రాంగణంలో నిరవధి%B

➡️