అనంత రామ శర్మ మృతికి- సిపిఎం ఎపి రాష్ట్ర కమిటీ సంతాపం

తెలంగాణ :తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా సిపిఎం నాయకులు, కార్మికోద్యమ నాయకులు పెన్నా అనంతరామ శర్మ మృతికి సిపిఐ ఎం ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ తీవ్ర సంతాపం ప్రకటంచింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు గురువారం ఈ మేరకు ఒక సంతాప సందేశాన్ని పంపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర నిర్వహించడమే కాక ఆ తర్వాత పార్టీ విచ్ఛిన్నాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలబడ్డ నాయకుడు అనంతరామ శర్మ అని శ్రీనివాసరావు కొనియాడారు. చివరి శ్వాస వరకు నిలబడి ఉద్యమాన్ని కాపాడి, దాని అభివఅద్ధికి అహరహం కఅషిచేసిన అనంతరామశర్మ మృతి కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని వ్యాఖ్యానించారు. ఆయనకు సిపిఎం ఆంధ్ర ప్రదేశ్‌ కమిటీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నదని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నదని శ్రీనివాసరావు తన సందేశంలో పేర్కొన్నారు.

➡️