ఏపీలో 2024 ఓటర్ల తుది జాబితా విడుదల

Jan 22,2024 15:59

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌(CEO Andhra)లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లుగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్‌సైట్‌లో ఈసీ అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఈసీ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.

➡️