మహిళలకు అన్యాయం.. ఆ జిఒను వెనక్కి తీసుకోండి : ఖర్గేకు కవిత లేఖ

Feb 19,2024 13:23 #Kharge, #letter, #mlc kavita

తెలంగాణ : ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం చేసే కొత్త జిఒ ను వెంటనే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయాలని కోరుతూ … ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే కు, ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు.

ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల 50 వేల మంది ఇప్పటికే టీఎస్పీఎస్సీ వెబ్‌ సైట్‌ లో నమోదు చేసుకున్నారని… అంటే 33.3 శాతం రిజర్వేషన్ల మేరకు కనీసం 66 వేల మంది ఆడబిడ్డలకు ఉద్యోగాలు కచ్చితంగా రావాలని కవిత లేఖలో తెలిపారు. ఈ స్పూర్తిని పక్కనబెడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొత్త జిఒను తీసుకురావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ విషయంలో ఖర్గే జోక్యం చేసుకొని ఈ జిఒ ను తక్షణమే వెనక్కి తీసుకునేలా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానని లేఖలో కవిత కోరారు. ” మీ ప్రభుత్వ నిర్ణయం వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు తీరని అన్యాయం జరుగుతుంది. ఒక ఆడబిడ్డగా, ఆడబిడ్డల హక్కుల కోసం మాట్లాడేటటువంటి వ్యక్తిగా తెలంగాణలో మీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నాను. ఈ అంశంపై జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ వైఖరి ఏమిటో చెప్పాలి. సుప్రీం కోర్టు తీర్పును పాటించబోమంటూ బీహార్‌, కర్నాటక రాష్ట్రాలు జీవో లు జారీ చేశాయి. కానీ తెలంగాణలో మాత్రం మీ గ్యారెంటీతోని ఇందిరమ్మ రాజ్యంగా చెబుతూ ఏర్పడిన కొత్త ప్రభుత్వంలో ఇంటి ఆడబిడ్డలకు తీరని అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో తమరు జోక్యం చేసుకొని ఈ జీవోను తక్షణమే వెనక్కి తీసుకునేలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి గారికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.” అని ఎమ్మెల్సీ కవిత లేఖలో ఖర్గేకు విజ్ఞప్తి చేశారు.

➡️