మెరుగుపడుతున్న తమ్మినేని ఆరోగ్యం

తెలంగాణ : ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెండు రోజుల క్రితం వైద్యులు వెంటిలేటర్‌ను తొలగించారు. అప్పటి నుండి ఎలాంటి సమస్యా లేకుండా తమ్మినేని స్వయంగా శ్వాస తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో, పార్టీ నాయకులతో మాట్లాడుతున్నారు. శనివారం వార్త పత్రికలను కూడా చదివారు. పార్టీ ముఖ్య నాయకులు ఆయనను పరామర్శించారు. కొద్ది రోజుల్లోనే తమ్మినేని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కానున్నారని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌ తెలిపారు. తమ్మినేనిని పరామర్శించేందుకు ఎవరూ ఆస్పత్రికి రావొద్దని, ఎక్కువ మంది వస్తే ఆయన ఇబ్బంది పడే అవకాశం ఉంటుందని పోతినేని పార్టీ కార్యకర్తలకు విజప్తి చేశారు.

➡️