నెత్తిన సూరీడు మండిపోతున్నాడు… పింఛను ఎప్పుడిస్తారో ?

Apr 3,2024 10:24 #Pension, #sun burning

ప్రజాశక్తి-అమరావతి : ”ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది” అన్న చందంగా … ఎన్నికల కోడ్‌ వచ్చి ముసలి ప్రాణాలు తల్లడిల్లిపోయేలా చేసింది. ఎప్రిల్‌ నెల కాబట్టి పింఛను కాస్త నెమ్మదిగా 3వ తేదీన వస్తుందని, ఎలక్షన్‌ కోడ్‌ నేపథ్యంలో ఎవరికివారే సచివాలయాలకు వెళ్లి పింఛన్లు తెచ్చుకోవాలని ముందుగానే అవ్వా తాతలకు సమాచారం ఇవ్వడంతో…. బుధవారం తెల్లవారుతుండగానే వృద్ధులంతా సచివాలయాలకు చేరుకున్నారు. ఉదయం 10 గంటలు దాటినప్పటికీ సచివాలయాల తలుపులు తెరవలేదు.. కనీసం ఏమయ్యిందో చెప్పే దిక్కూ లేదు.. అక్కడే ముసలివారంతా కూర్చొని పడిగాపులు కాస్తున్నారు. నెత్తిపై మండుటెండ … గొంతు తడిపే దిక్కూ లేదు..! కొన్ని చోట్ల పింఛన్‌ సొమ్ము ఇంకా బ్యాంకుల్లో పడలేదు.. ఎప్పుడు సొమ్ము వస్తుందో తెలీదు.. అని చెబుతుండటంతో అసలు పింఛను వస్తుందో.. రాదో అనే సందిగ్ధంలో ఉసూరుమని వృద్ధులు కాళ్లనీడుస్తున్నారు. ” ఎండలో అగచాట్లు పడుతున్నాం.. కనీసం ఒక్క మాట చెప్పే దిక్కూ లేదు.. ” అంటూ ముసలివారు ఆవేదనతో మొరపెట్టుకుంటున్నారు.

అనంతపురం
అనంతపురం
roddam sachivalayam
roddam sachivalayam
talupula mandalam atp
talupula mandalam atp
ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి)
ప్రజాశక్తి-ఉండి (పశ్చిమ గోదావరి)
➡️