నేడు కుప్పంకు ముఖ్యమంత్రి చంద్రబాబు

Jun 25,2024 06:50 #chandrababau, #kuppam, #paryatana
  • స్వంత నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటన

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : రెండు రోజుల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 12.30 గంటలకు కుప్పంకు చేరుకుంటారు. 12.55 గంటలకు నియోజకవర్గంలోని శాంతిపురం మండలం జల్లిగానిపల్లి, చిన్నారిదొడ్డి గ్రామాల్లో హంద్రీనీవా కాల్వను పరిశీలించనున్నారు.
అక్కడి నుంచి నేరుగా ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంకాలం కుప్పం ఆర్‌టిసి బస్టాండ్‌ (ఎన్టీఆర్‌ సర్కిల్‌) వద్ద బహిరంగసభలో ప్రసంగించనున్నారు. రాత్రికి ఆర్‌అండ్‌బి అతిథి గృహంలోనే బస చేయనున్నారు. బుధవారం ఉదయం10.30 గంటలకు అక్కడే అర్జీలను స్వీకరించనున్నారు. పిఇఎస్‌ మెడికల్‌ కళాశాల పక్కన ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో కుప్పం నియోజకవర్గంలోని అధికారులతో ప్రత్యేకంగా సమావేశం, భోజన విరామం అనంతరం 2.35 గంటలకు కుప్పం పార్టీ క్యాడర్‌తో సమావేశం కానున్నారు. 4.10 గంటలకు తిరుగు ప్రయాణమై విజయవాడకు చేరుకుంటారు.

➡️