వారిపై అవమానకరదాడిని ఖండిస్తున్నాం : రాహుల్‌ గాంధీ

అమరావతి : ఎపి కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌.షర్మిలపై సోషల్‌ మీడియా వేదికగా జరుగుతున్న దాడిని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఖండించారు. మహిళలను అవమానించడం, వారిపై దాడి చేయడం పిరికిపంద చర్యని ధ్వజమెత్తారు. ఇటీవల కాలంలో శక్తిహీనులకు ఇది ఒక ఆయుధంగా మారిపోయిందన్నారు. వైఎస్‌.షర్మిల, సునీతలకు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుందని, వారిపై సోషల్‌ మీడియాలో జరిగిన ఈ అవమానకర దాడిని కాంగ్రెస్‌ పార్టీ ఖండిస్తోందని ఎక్స్‌ వేదికగా రాహుల్‌ పేర్కొన్నారు.

➡️