తల్లి కాబోతున్న అమలాపాల్‌

Jan 4,2024 16:37 #Amala Paul, #baby bump

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరోయిన్‌ అమలాపాల్‌ తల్లికాబోతోంది. న్యూ ఇయార్‌లో ఈ గుడ్‌న్యూస్‌ని ఆమె సోషల్‌మీడియా వేదికగా తెలిపింది. బేబి బంప్‌ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్టు చేసింది. తన భర్త జగత్‌ దేశారు గుండెలో ఉన్నట్టుగా ఒక ఫొటో, తాను బేబీ బంప్‌ని పట్టుకున్న ఫొటోను అమల్‌పాల్‌ పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలకు నీతో (భర్త జగత్‌ దేశారు) 1+1 = 3 అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది’ అని క్యాప్షన్‌ రాసుకొచ్చింది. కాగా, అమలాపాల్‌ గతేడాది నవంబర్‌ 5న కొచ్చిలో జగత్‌ దేశారుని వివాహం చేసుకున్నారు. ఈమె గతంలో డైకెర్టర్‌ విజరుని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత మనస్పర్థలొచ్చి వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

 

➡️