Jagapathi Babu : హీరో జగపతిబాబు సినిమల్లోకి రాకపోతే ఏం అయ్యేవాడో తెలుసా?!

Mar 18,2024 16:20 #Hero, #Jagapathi Babu, #jagapatibabu, #movie

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరో జగపతిబాబు కథానాయకుడిగానే కాదు.. ప్రతినాయకుడిగా కూడా మెప్పిస్తున్నాడు. తెలుగు, మలయాళంతోపాటు ఇతర భాషల్లో కూడా విలన్‌ పాత్రల్లో నటించి ఉత్తమ నటుడిగా నిరూపించుకుంటున్నారు. ఆయన సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. సినిమాల్లో హీరోని కాకపోయి ఉంటే పోలీసుని అయ్యేవాడినని జగపతిబాబు చెప్పుకొచ్చారు. తాజాగా ఈయన ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు. ”సినిమాల్లోకి వచ్చి ఉండకపోతే… కచ్చితంగా సూపర్‌ పోలీసుని అయ్యేవాడిని. ఇప్పుడున్న సూపర్‌ పోలీసుల్లాగా.. లా అండ్‌ ఆర్డర్‌ని గడగడలాడించేవాడిని ఏం అంటారు? అని జగపతిబాబు తన పోస్టులో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.

➡️