హూలా హూప్స్‌ని తిప్పుతూ పజిల్‌ క్యూబ్‌ని క్లియర్‌ చేసి.. గిన్నీస్‌ రికార్డుకెక్కిన ఓ టీనేజ్‌ అమ్మాయి

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఐదు హూలా హూప్స్‌ని తిప్పుతూ నిమిషం లోపే ఎంతో క్లిష్టమైన పజిల్‌ క్యూబ్‌ని క్లియర్‌ చేసి.. ఓ టీనేజ్‌ అమ్మాయి గిన్నీస్‌ రికార్డుకెక్కింది. భారత్‌కు చెందిన ఆ అమ్మాయి పేరు ఎన్‌.ఎం. ఓవయసేన. ఈ అమ్మారు ఎంతో చాకచక్యంగా ఒకచేత్తో హూలా హూప్స్‌ని తిప్పుతూ.. 51.24 సెకన్ల వ్యవధిలోనే తన చేతిలో ఉన్న పజిల్‌ క్యూబ్‌ని క్లియర్‌ చేసింది. ఈ వీడియోను గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు (జిడబ్య్లుఆర్‌) ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో పోస్ట్‌ అయిన మూడు రోజుల వ్యవధిలో 2.2 మిలియన్‌ నెటిజన్లు వీక్షించారు. ఇక ఈ వీడియను చూసిన నెటిజన్లు ‘వావ్‌’, ‘అద్భుతం’ అని ఓవయసేనని అభినందిస్తున్నారు.

 

➡️