యువరాజ్‌సింగ్‌ ఎంపీగా పోటీ చేయనున్నాడా?

Feb 22,2024 16:52 #Sports, #yuvaraj singh

ఇంటర్నెట్‌డెస్క్‌ : భారత మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ యువరాజ్‌ సింగ్‌ తల్లి షబ్నమ్‌ను కలిశాడు. దీంతో బిజెపి టికెట్‌పై యువరాజ్‌ సింగ్‌ ఎంపీగా పోటీ చేయనున్నట్లు వార్తలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై యువరాజ్‌ సింగ్‌ మాత్రం ఇంకా స్పందించలేదు. మరి ఈ వార్తల్లో నిజం తెలియాలంటే.. యువరాజ్‌ స్పందించినదాకా ఆగాల్సిందే.

➡️