Kalki Movie : ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రికార్డును బద్దలు కొట్టిన కల్కి

Jun 13,2024 11:49 #kalki movie, #record

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరో ప్రభాస్‌ నటిస్తున్న తాజా చిత్రం కల్కి. ఈ సినిమాను దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా చిత్రయూనిట్‌ విడుదల చేసిన ఈ మూవీ ట్రైలర్‌కి విశేష స్పందన లభిస్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర న్యూస్‌ ట్రెండ్‌ అవుతోంది. అదేమిటంటే.. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కన్నా.. మూవీ అడ్వాన్స్‌ బుకింగ్‌ విషయంలో కల్కి చిత్రం రికార్డు బద్దలు కొట్టిందని టాక్‌ వినిపిస్తోంది. ఈ నెల 27న విడుదలయ్యే మూవీ కోసం.. యావత్‌ ప్రపంచ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో కల్కి ప్రీ సేల్స్‌ వన్‌ మిలియన్‌ మార్క్‌ను దాటాయి. దీంతో వన్‌ మిలియన్‌ ప్రీ సేల్స్‌ జరుపుకున్న మొదటి ఇండియన్‌ సినిమాగా కల్కి రికార్డుకెక్కింది. ఈ సినిమా ఇదే ట్రెండ్‌ కొనసాగితే.. మరిన్ని రికార్డులను బద్దలుకొట్టే అవకాశముందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబచ్చన్‌, దీపికా పదుకొనే, విశ్వనటుడు కమల్‌హాసన్‌, మరో హీరోయిన్‌ దిశాపటాని వంటి ప్రముఖ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ తెరకెక్కిస్తుంది.

➡️