త్వరలో పెళ్టి పీటలెక్కనున్న హీరోయిన్‌ కృతి

Feb 15,2024 17:30 #Kriti Kharbanda, #movie, #wedding

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ హీరోయిన్‌ కృతి కర్బంద త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ఆమె తాను ప్రేమించిన పుల్కిత్‌ సామ్రాట్‌ని వచ్చే (మార్చి) నెలలో వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్‌ డే సందర్భంగా కృతి, పుల్కిత్‌ కలిసి ఉన్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి.. మార్చి నెలలో ఒక్కటి కాబోతున్నట్లు హింట్‌ ఇచ్చింది. కాగా, గతకొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఇటీవలే రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ కావడం వల్ల.. వీరి పెళ్లి ఎప్పుడంటూ నెట్టింట న్యూస్‌ హల్‌చల్‌ అయ్యాయి. ఈ న్యూస్‌కి కృతి క్లారిటీ ఇచ్చేసింది.

కృతి తెలుగులో ‘బోణి’ అనే చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ‘అలా మొదలైంది’. ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’, ‘తీన్‌మార్‌’, ఒంగోలుగిత్త, బ్రూస్‌లీ, మిస్టర్‌ నూకయ్య, ఓం త్రీడీ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె తెలుగుతోపాటు కన్నడ సినిమాల్లోనూ నటించింది. ప్రస్తుతం కృతి ‘రిస్కీ రోమియో’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. కృతి కర్బంద, పుల్కిత్‌ సామ్రాట్‌ ‘పాగల్‌ పంటి’, ‘తైష్‌’ సినిమాల్లో కలిసి నటించారు. వెండితెరపై కనిపించిన రీల్‌ జంటే.. త్వరలో రియల్‌ జంట కానుంది.

➡️