గడ్డకట్టిన నదిపై ల్యాండ్‌ అయిన విమానం

Dec 28,2023 16:17 #frozen river, #Russia plane

మాస్కో :    పైలెట్‌ తప్పిదం కారణంగా ఓ విమానం గడ్డకట్టిన నదిపై ల్యాండ్‌ అయింది. రష్యాలో గురువారం ఈ ఘటన జరిగింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

వివరాల ప్రకారం.. సోవియట్‌ కాలం నాటి పోలార్‌ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఆంటోనోవ్‌ -24 విమానం 30 మంది ప్రయాణికులతో వెళుతోంది. అయితే పైలెట్‌ తప్పిదం కారణంగా రష్యాలోని తూర్పు ప్రాంతంలో విమానాశ్రయానికి సమీపంలో గడ్డకట్టిన నదిపై ల్యాండ్‌ అయింది. యాకుటియా ప్రాంతంలోని జిర్యాంకా సమీపంలోని కొలిమా నదిపై దిగినట్లు తూర్పు సైబీరియన్‌ రవాణా ప్రాసిక్యూటర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఎఎన్‌ -24 విమానం జర్యాంకా విమానాశ్రయం రన్‌వే వెలుపల దిగిందని పోలార్‌ ఎయిర్‌లైన్స్‌ కూడా ఓ ప్రకటనలో పేర్కొంది.  విమానం నుండి గడ్డకట్టిన నదిపై ప్రయాణికులు దిగుతున్న దృశ్యాలను స్థానిక పత్రిక ప్రచురించింది.

➡️