మెట్రో స్టేషన్‌లో తల్లీ బిడ్డల ప్రాణాల్ని కాపాడిన సెక్యూరిటీగార్డ్‌ : వీడియో వైరల్‌

Jan 23,2024 15:50 #Viral Video

ఇంటర్నెట్‌డెస్క్‌ : మెట్రో రైల్వేస్టేషన్‌లో ఓ సెక్యూరిటీగార్డ్‌ తన సమయస్పూర్తితో ఓ తల్లీబిడ్డను కాపాడారు. పూణె సివిల్‌ కోర్టు మెట్రో స్టేషన్‌లో ఓ మూడేళ్లబాలుడు పట్టాలపై పడిపోయాడు. తన కుమారుడిని రక్షించేందుకు తల్లి కూడా పట్టాలపై దూకేసింది. ఈలోపే మెట్రో రైల్‌ సమీపిస్తుంది. దీంతో అక్కడున్న సెక్యూరిటీ గార్డు వెంటనే ఎమర్జెన్సీ బటన్‌ని నొక్కాడు. దీంతో మరికొద్ది క్షణాల్లో స్టేషన్‌కి చేరాల్సిన రైలు.. 30 మీటర్ల దూరంలో ఆగిపోయింది. ఈలోపు ట్రాక్‌పై పడ్డ తల్లీబిడ్డలిద్దరినీ అక్కడున్న జనాలు పైకి లేపారు. ఆ సెక్యూరిటీగార్డు పేరు వికాస్‌ బంగర్‌. ఇతను ఆ తల్లీబిడ్డల్ని కాపాడినందుకు అతన్ని అందరూ అభినందిస్తున్నారు.

➡️