చికెన్‌ టిక్కాను తిన్న విరాట్‌ కోహ్లి.. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే..?

Dec 13,2023 18:03 #Chicken, #Virat Kohli

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ చికెన్‌ టిక్కా తిన్నాడు. ఈ ఫొటోలు కూడా తానే స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘ఈ మాక్‌ చికెన్‌ టిక్కాను మీరు తప్పక ఇష్టపడతారు.’ అంటూ ఈ ఫొటోకి క్యాప్షన్‌ కూడా పెట్టాడు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ పోస్టు చూసిన నెటిజన్లు షాకయ్యారు. కోహ్లి శాఖాహారి కదా..! మరి ఇప్పుడు చికెన్‌ తినడం ఏంటి? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. కోహ్లీ తిన్నది చికెన్‌ టిక్కా కాదు. మాక్‌ చికెన్‌ టిక్కా అన్నది వెజిటేరియన్‌ ఫుడ్‌. దీన్ని ఓ మొక్కతో తయారు చేస్తారు. నెటిజన్లు చికెన్‌ టిక్కా అన్న పదాన్నే చూశారు. మాక్‌ చికెన్‌ టిక్కా అన్న పదాన్ని చూడలేదు అని ఓ నెటిజన్‌ క్లారిటీ ఇచ్చాడు. మాక్‌ చికెన్‌ టిక్కాను తయారు చేయడానికి సోయాను వాడతారు. దీన్ని తింటే నాన్‌వెజ్‌ తిన్నట్టే ఉంటుంది. అందుకే నాన్‌వెజ్‌ తిననివాళ్లు దీన్ని ఇష్టంగా తింటారు.

➡️