వావ్‌..! మెరిసే చేపలు..! సైంటిస్టులు తయారుచేశారు..!

Dec 18,2023 13:41 #fish, #Shiny, #Wow

JellyFish : రంగురంగుల చేపలు చూపుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. ఫిష్‌ ఎగ్జిబిషన్‌లలో ఉండే సందడి గురించి చెప్పనక్కరలేదు. ఎన్నో రంగురంగుల చేపలను చూసే ఉంటారు కానీ లైట్‌లాగా మెరిసే చేపలను చూశారా ? రేడియం లైట్లలాగా మెరిసే చేపలను సైంటిస్టులు తయారుచేశారు…! అవి అచ్చం చూడటానికి లైట్‌లల్లా మెరిసిపోతున్నాయి..! ఆ చేపలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చేపల వీడియోను ట్విట్టర్‌ లో పోస్ట్‌ చేయగా ఇప్పటివరకు కోటి 78 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి.

జెల్లీ ఫిష్‌ లను కార్ప్‌ చేపల డీఎన్‌ఏలోకి ప్రవేశపెట్టారు…

జెనెటిక్‌ ఇంజనీరింగ్‌ ద్వారా మెరిసే చేపలను శాస్త్రవేత్తలు సృష్టించారు. జన్యులను మార్చేస్తే జంతువులు లేదా జీవులు కొత్త విధులను కూడా చేయగలవు. ఈ టెక్నాలజీ ఒక అద్భుతం అని చెప్పవచ్చు. అయితే ఒకానొక సమయంలో దీనిని ఉపయోగించి తైవాన్‌లోని శాస్త్రవేత్తలు మెరుస్తున్న చేపలను సృష్టించారు. వాటిని జెల్లీ ఫిష్‌ లను కార్ప్‌ చేపల డీఎన్‌ఏలోకి ప్రవేశపెట్టారు. అలా వచ్చిన చేపలే ఈ మెరిసే చేపలు.. అచ్చం రేడియం లైట్లు లాగే ఉన్నాయి.

కారణమేమిటంటే …

ఎన్విరాన్‌మెంటల్‌ అప్లికేషన్స్‌ కోసం ఈ చేపలను సృష్టించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మెరుస్తున్న కార్ప్‌లను నీటి వనరులలో కాలుష్య స్థాయిలను గుర్తించడానికి ఎన్విరాన్‌మెంటల్‌ సెన్సార్లుగా ఉపయోగించవచ్చునని తెలిపారు. వాటి గ్లో తీవ్రత కాలుష్య కారకాల ఉనికిని, గాఢతను సూచిస్తుందంట. నీటి నాణ్యతను అంచనా వేయడానికి విజువల్‌ ఇండెక్స్‌ కూడా అందిస్తుందట. జీవులలోని కణాల ప్రవర్తన, కదలికలను ట్రాక్‌ చేయడానికి, సంక్లిష్ట జీవ ప్రక్రియలను తెలుసుకోవడం కోసం వీటిని సృష్టించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వీడియో చూడండి : https://twitter.com/gunsnrosesgirl3/status/1735919663932973434

➡️