హైదరాబాద్ : హైదరాబాద్ ఫిలింనగర్లోని ఓ పబ్లో పీకల వరకు మద్యం తాగిన యువకులు ఓ యువతితో డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.వారి ప్రవర్తపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువతితో వచ్చిన యువకుడు వారిని అడ్డుకున్నాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి ఆకతాయిల దాడిలో గాయపడిన ముగ్గురు యువకులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిందితులు తుపాకితో బెదిరించి బీరుబాటిళ్లతో కొట్టి గాయపర్చినట్టు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.