శీతాకాలంలో సాక్సులు ధరించి నిద్రపోవచ్చా?

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో చలికి తట్టుకోలేక చలికోట్లు ధరిస్తారు. ఇక చిన్నారులకైతే ప్రత్యేకంగా చేతులకు, కాళ్లకు సాక్సులు వేస్తారు. పడుకునేటప్పుడు చిన్నారులకు చలి తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్క చిన్నారులే కాదు.. ఎవరైనా సాక్సులు ధరించి నిద్రపోతే ప్రయోజనాలున్నాయి అని పలు పరిశోధనల్లో తేలింది. మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా..!

– శీతాకాలంలో నిద్రపోయే ముందు సాక్సులు ధరించడం వల్ల శరీరానికి వెచ్చదనాన్నిస్తాయి. దీంతో మీరు త్వరగా నిద్రపోతారు.

– సాక్స్‌లు కాలి వేళ్లలోని రక్తనాళాలను వెచ్చగా ఉంచుతాయి. ఈ కాలంలో పాదాలు పగులుతాయి. దీంతో నడవలేక ఎన్నో ఇబ్బందులు పడతారు. సాక్స్‌లు వేసుకుంటే మీ పాదాలు మృదువుగా ఉంటాయి. హైడ్రేట్‌గా ఉంచుతాయి.

– సాక్స్‌లు మందంగా ఉండకూడదు. మందంగా ఉన్నవి ధరిస్తే.. చెమట పట్టి అలర్జీలు సోకే ప్రమాదముంది. అందుకు మీరు కాళ్లకు గాలి తగిలే సాక్సులు ధరిస్తే మంచిది.

– మురికిగా ఉన్న సాక్సులు ధరించకూడదు. సాక్సులు మరీ బిగుతుగా ఉండేవి కాకుండా, మరీ లూజ్‌గా ఉండేవి కాకుండా సౌకర్యవంతంగా ఉండేవి ధరించాలి.కాటన్‌వి లేదా ఉన్నితో తయారుచేసిన సాక్సులు ధరిస్తే మంచిది. నైలాన్‌, పాలిస్టర్‌ సాక్స్‌ని ధరించకుండా ఉంటే మంచిది.

➡️