రేగి పండు.. ఆరోగ్యానికి మెండు

Dec 14,2023 12:19 #health

 

ఇంటర్నెట్‌డెస్క్‌ : శీతాకాలంలో రేగిపండ్లు విరివిగా లభిస్తాయి. ఈ సీజన్‌లో దొరికే వీటిని తింటే.. ఎన్నో రోగాలు నయమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

– శీతాకాలంలో కీళ్లనొప్పులు బాధిస్తాయి. రేగిపండ్లను ఎక్కువగా తీసుకుంటే.. కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

– రేగిపండ్లు రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యల్ని తగ్గిస్తాయి.

– రేగిపండ్లలో యాంటీమైక్రోబయల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఇన్ఫెక్షన్‌ల బారినపడకుండా కాపాడుతుంది.

– రేగిపళ్లలో పొటాషియం, ఫాస్ఫరస్‌, మాంగనీస్‌, ఐరన్‌, జింక్‌ పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి జీర్ణశక్తికి, ఆకలిపెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు.

➡️