ఎఐసిటిఇతో సర్వీస్‌నౌ జట్టు

Feb 20,2024 21:30 #Business

హైదరాబాద్‌ : ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఐసిటిఇ)తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ప్రముఖ డిజిటల్‌ వర్క్‌ఫ్లో కంపెనీ సర్వీస్‌నౌ ప్రకటించింది. దీంతో తమ సర్వీస్‌నౌ వేదికపై తొలి ఏడాదిలో 10వేల మంది విద్యార్థులను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంది. ఇందుకోసం ఎఐసిటిఇతో అవగాహన ఒప్పందం (ఎంఒయు)పై సంతకం చేసినట్లు పేర్కొంది. దీంతో వచ్చే మూడేళ్లలో 25,000 మంది విద్యార్థులను నైపుణ్య వంతులుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సర్వీస్‌నౌ చీఫ్‌ స్ట్రాటజీ, కార్పొరేట్‌ వ్యవహారాల అధికారి నిక్‌ ట్జిట్జోన్‌ పేర్కొన్నారు. టెక్‌, డిజిటల్‌ రంగంలో శిక్షణ ఇవ్వనున్నామన్నారు.

➡️