ఐబిఎ నూతన ఛైర్మన్‌గా ఎంవి రావు

Mar 21,2024 22:21 #Business

న్యూఢిల్లీ : ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) నూతన ఛైర్మన్‌గా సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌, సిఇఒ మాటమ్‌ వెంకటరావు నియమితులయ్యారు. గురువారం జరిగిన ఐబిఎ మేనేజింగ్‌ కమిటీలో ఆయనను ఎన్నుకున్నారు. కమిటీ సభ్యులుగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) ఛైర్మన్‌ దినేష్‌ కుమార్‌, ఇండియన్‌ బ్యాంక్‌ ఎమ్‌డి ఎస్‌ఎల్‌ జైన్‌, సిటీ యూనియన్‌ బ్యాంక్‌ ఎమ్‌డి ఎన్‌ కామకొడి ఉన్నారు. అదే విధంగా బ్యాంక్‌ ఆఫ్‌ బహ్రాన్‌ అండ్‌ కువైట్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, కంట్రీ హెడ్‌ను అసోసియేషన్‌ గౌరవ సెక్రటరీగా ఎన్నుకున్నారు.

➡️