కొద్ది మంది ఎదుగుదలతోనే దేశం అభివృద్ధి చెందినట్లా..!

న్యూఢిల్లీ :  కొద్ది మంది వ్యక్తుల ఎదుగుదలతో దేశం అభివృద్ధి చెందినట్లు కాదని సమాజ్‌ వాది పార్టీ అధ్యక్షుడు, ఎంపి అఖిలేష్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు. గురువారం పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో భారత్‌ ఐదవ అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా విస్తరించిందని, త్వరలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అయినా రైతులు ఎందుకు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇంత పెద్ద ఎత్తున యువత ఎందుకు నిరుద్యోగులుగా మిగిలిపోయారని ప్రశ్నించారు.

➡️