పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బిఐ కొరడా

Jan 31,2024 21:10 #Business

డిపాజిట్ల సేకరణపై నిషేధం

న్యూఢిల్లీ : పేటియం పేమెంట్‌ బ్యాంక్‌కు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ఊహించని షాక్‌ ఇచ్చింది. ఆ సంస్థ సమీకరించే డిపాజిట్లు, రుణ లావాదేవీలపై నిషేధం ప్రకటించింది. రెగ్యూలేటరీ నిబంధనలను పాటించకపోవడం, పర్యవేక్షణలో లోపాల నేపథ్యంలో పేటియం పేమెంట్‌ బ్యాంక్‌పై ఆర్‌బిఐ చర్యలకు ఉపక్రమించింది. ఫిబ్రవరి 29 తర్వాత పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖాతాదారుల ఖాతాల్లో ఎలాంటి డిపాజిట్లు తీసుకోవడానికి అనుమతించబోమని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. వాలెట్లతో సహా ఎలాంటి రుణ లావాదేవీలు అనుమతించబడవని తెలిపింది. కాగా.. ఖాతాదారులు మాత్రం ఎలాంటి పరిమితులు లేకుండా తమ డిపాజిట్లను ఉపసంహరించుకోవడానికి, వినియోగించుకోవడానికి వీలు కల్పిస్తున్నట్లు ఆర్‌బిఐ పేర్కొంది.

➡️