పేటియం బ్యాంక్‌ ఖాతాదారులకు ఎస్‌బిఐ ఎర్రతివాచీ

Feb 3,2024 21:38 #Business

న్యూఢిల్లీ : పేటియం పేమెంట్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బిఐ నియంత్రణ చర్యల నేపథ్యంలో ఆ సంస్థ వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) సన్నద్దంగా ఉందని ఎస్‌బిఐ చైర్మన్‌ దినేష్‌ ఖారా తెలిపారు. పేటియం పేమెంట్‌ బ్యాంక్‌ ఖాతాల వన్‌ టైం మైగ్రేషన్‌కు వ్యాపారులను స్వాగతించడానికి సంతోషంగా ఉన్నామన్నారు. ”మేము వ్యాపారులందరినీ చేరదీస్తున్నాము. తాము పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టెర్మినల్స్‌, క్యూఆర్‌ కోడ్‌లు లేదా యాప్‌ ఆధారిత పరిష్కారాలకు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాము.” అని ఖారా తెలిపారు.

➡️