సౌండ్‌బార్‌ విభాగంలోకి అర్బన్‌ కంపెనీ

Mar 11,2024 20:57 #Business, #urban compnay

హైదరాబాద్‌ : దేశీయ సాంకేతికత బ్రాండ్‌ అయిన అర్బన్‌ కొత్తగా హార్మోనిక్‌ సిరీస్‌ సౌండ్‌బార్‌ల విభాగంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. వివిధ విభాగాలను దృష్టిలో ఉంచుకుని బ్రాండ్‌ హార్మోనిక్‌ 2240 విత్‌ డాల్బీ సరౌండ్‌ సౌండ్‌ అండ్‌ హార్మోనిక్‌ 1120 డీప్‌ బాస్‌ హెచ్‌డి సౌండ్‌ను విడుదల చేసినట్లు తెలిపింది. వీటి ప్రారంభ ధరను రూ.9,999గా నిర్ణయించింది. ఇవి ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లోనూ లభ్యమవుతాయని అర్బన్‌ సహ వ్యవస్థాపకుడు ఆశిష్‌ కుంభట్‌ తెలిపారు.

➡️