వినోద, రిటైల్‌ రంగాల్లోకి అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌

May 27,2024 21:22 #aparna, #Business

హైదరాబాద్‌ : అపర్ణ కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ తమ వ్యాపార విభాగాలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కొత్తగా రిటైల్‌, వినోద రంగాలలో ప్రవేశం కోసం రూ.284 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు వెల్లడించింది. రిటైల్‌ రంగంలో విస్తరణ కోసం రూ.252 కోట్లు పెట్టుబడితో తమ మొదటి మాల్‌ అపర్ణ నియోను ప్రారంభింస్తునట్లు తెలిపింది. వినోద విభాగంలోకి ప్రవేశించడానికి రూ.32 కోట్ల వ్యయంతో అపర్ణ సినిమాస్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. అత్యంత వేగంగా అభివృద్థి చెందుతున్న నల్లగండ్ల ప్రాంతంలో ఉన్న అపర్ణ నియో 3.67 ఎకరాలలో 3.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉందని ఆ సంస్థ ఎండి రాకేష్‌ రెడ్డి తెలిపారు. 1990 నుండి అపర్ణ గ్రూప్‌ వివిధ రకాల వ్యాపార విభాగాలలో ప్రవేశిస్తుండటం ద్వారా తమ పోర్ట్‌ఫోలియోను స్థిరంగా విస్తరిస్తుందన్నారు. అపర్ణ నియో మాల్‌ను మే 31న సందర్శకుల కోసం తెరువనున్నామన్నారు.

➡️