హిండ్‌వేర్‌ నుంచి ఆక్వా ప్రో వాటర్‌ సేవింగ్‌ సొల్యూషన్స్‌

Apr 2,2024 21:26 #Business

న్యూఢిల్లీ : ప్రముఖ బాత్‌వేర్‌ బ్రాండ్‌ అయిన హిండ్‌వేర్‌ ‘ఆక్వా ప్రో వాటర్‌ సేవింగ్‌ సొల్యూషన్స్‌’ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇందులో మూడు అధునాతన స్ప్రే మోడ్‌ నాజిల్‌లను ఆవిష్కరించినట్లు పేర్కొంది. వీటితో 98 శాతం వరకు నీటిని పొదుపు చేయడానికి వీలుందని పేర్కొంది. ఈ వినూత్న పరిష్కారాలను మరింత మందికి సరసమైన ధరకు అందుబాటులో ఉంచడమే తమ లక్ష్యమని హింద్‌వేర్‌ లిమిటెడ్‌ బాత్‌ అండ్‌ టైల్స్‌ సిఇఒ సుధాంశుపోఖ్రియాల్‌ పేర్కొన్నారు.

➡️