బైజూస్‌ ఫౌండర్‌ ఇళ్లు తాకట్టు

Dec 6,2023 09:00 #Business
  • ఉద్యోగుల వేతనాల చెల్లింపు కోసం

బెంగళూరు : ఒకప్పుడు కరోనా కాలంలో వెలుగువెలిగిన ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ బైజూస్‌ ఇప్పుడు తీవ్ర గడ్డుకాలాన్ని ఎదుర్కొంటుంది. కనీసం ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితిలోకి జారుకుంది. దీంతో జీతాలు చెల్లించేందుకు బైజూస్‌ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌ తన ఇళ్లును తాకట్టు పెట్టారని రిపోర్టులు వస్తున్నాయి. బెంగళూరులోని తన కుటుంబ సభ్యులకు చెందిన రెండు ఇళ్లతోపాటు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఓ విల్లాను రవీంద్రన్‌ తాకట్టు పెట్టారని సమాచారం. ఆయా నివాసాలను తాకట్టు పెట్టి దాదాపు రూ.100 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది. బైజూస్‌ నవంబర్‌కు సంబంధించిన వేతనాలు ఆలస్యం అయ్యాయని ఇటీవల రిపోర్టులు వచ్చాయి. దాదాపుగా 1,000 మంది ప్రభావితం అయ్యారు. బైజూస్‌కు ఇండియాలో 14,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు.

➡️