Air India: భోజనంలో బ్లేడ్‌..

న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా విమానంలో ప్రయాణికులకు అందించే భోజనంలో మెటల్‌ బ్లేడ్‌ వచ్చింది. దీనిపై బాధిత ప్రయాణికుడు ఫిర్యాదు చేశాడు. కాగా.. ఆ విషయం నిజమేనని ఎయిర్‌ ఇండియా చీఫ్‌ కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఆఫీసర్‌ రాజేష్‌ డోగ్రా ధృవీకరించారు. ప్రయాణికుడి భోజనంలో గుర్తించిన మెటల్‌ వస్తువుపై వెంటనే దర్యాప్తు జరిపామన్నారు. కూరగాయలు కట్‌ చేసేందుకు ఉపయోగించే ప్రాసెసింగ్‌ మెషీన్‌ నుంచి ఆ మెటల్‌ వస్తువు వచ్చినట్లు తెలిసిందన్నారు. తమ క్యాటరింగ్‌ భాగస్వాములు ఏదైనా గట్టి కూరగాయలను తరిగే క్రమంలో జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపడుతామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామన్నారు.

➡️