Byju’s ఇండియా సిఇఒ అర్జున్‌ మోహన్‌ రాజీనామా..

Apr 15,2024 12:12 #BYJU'S India, #Byjus, #CEO Quits

బెంగళూరు : ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ భారతీయ విభాగం సిఇఒ అర్జున్‌ మోహన్‌ సోమవారం రాజీనామా చేశారు. దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలనుఆ సంస్థ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ తెలిపింది.

బైజూస్‌ ఇండియా కార్యకలాపాలను మూడు విభాగాలుగా ది లెర్నింగ్‌ యాప్‌, ఆన్‌లైన్‌ క్లాసెస్‌ అండ్‌ ట్యూషన్‌ సెంటర్స్‌, టెస్ట్‌-ప్రెప్‌లుగా పునర్‌వ్యవస్థీకరించనున్నట్లు సంస్థ ప్రకటించిన సమయంలో అర్జున్‌ మోహన్‌ రాజీనామా చేయడం గమనార్హం. ఏడు నెలల క్రితం అర్జున్‌ మోహన్‌ సిఇఒగా బాధ్యతలు చేపట్టారు. ఈ కీలక దశలో రాజీనామా చేసిన ఆయన, సంస్థకు సలహాదారుడిగా కొనసాగుతారని కంపెనీ పేర్కొంది.

➡️