భారీగా ఉద్యోగుల కోత

Feb 10,2024 15:49 #Business, #Employees, #job cuts, #Layoff
cisco-to-cut-thousands-of-jobs-as-it-seeks-to-focus-on-high-growth-areas

కత్తిరింపుల జాబితాలో మరో దిగ్గజ కంపెనీ

ఉద్యోగుల తొలగింపుల జాబితాలో మరో కంపెనీ చేరింది. నెట్‌వర్క్ దిగ్గజం సిస్కో తన వ్యాపారాన్ని పునర్నిర్మించాలని యోచనలో భాగంగా వేలాది మంది ఉద్యోగులను తొలగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ శాన్ జోస్ వెబ్‌సైట్ ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరం నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 84,900 ఉన్నారు. ఎంత మంది ఉద్యోగులను తొలగించాలనే అంశంపై కంపెనీ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
స్నాప్ చాట్ యజమాని అయిన స్నాప్ మొత్తం వర్క్ ఫోర్సులో దాదాపు 10% మందిని తొలగించనుంది. వచ్చే వారం ప్రారంభంలో ఈ ప్రకటన రావచ్చు. నవంబర్ 2022లో సిస్కో తీసుకున్న ఈ విధమైన నిర్ణయం మొత్తం తన వర్క్ ఫోర్సులో దాదాపు 5% మందిపై ప్రభావం చూపింది. అయితే తాజా పరిణామాలపై వ్యాఖ్యానించడానికి సిస్కో నిరాకరించింది. ఇప్పటికే టెలికాం తయారీదారులు నోకియా, ఎరిక్సన్‌తో సహా టెక్ కంపెనీలు గత సంవత్సరం ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో వేలాది ఉద్యోగాలను తొలగించారు. అమెజాన్, ఆల్ఫాబెట్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి అనేక పెద్ద సాంకేతిక సంస్థలు ఇటీవల తొలగింపులను అమలు చేశాయి. సిస్కో నెట్‌వర్కింగ్ పరికరాలకు డిమాండ్ మందగించడంతో దాని ఆదాయం, లాభాల అంచనాలను తగ్గించింది.

➡️