KBC : గ్లోబల్‌కు సిఆర్‌జెఇ కాంట్రాక్టు

Jun 17,2024 20:59 #Business, #KBC Global Limited

హైదరాబద్‌ : కెబిసి గ్లోబల్‌ లిమిటెడ్‌ (ఇంతక్రితం కర్దా కన్‌స్ట్రక్షన్‌)కు సిఆర్‌జెఇ లిమిటెడ్‌ నుంచి సాఫ్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగానికి సంబంధించిన 20 మిలియన్‌ డాలర్ల (రూ.167 కోట్లు) విలువ చేసే సబ్‌ కాంట్రాక్ట్‌ దక్కినట్లు ఆ సంస్థ తెలిపింది. నిర్మాణ, రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని సిఆర్‌జెఇ ఆఫ్రికాలో రైల్వేలు, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లను నిర్మిస్తోంది. కెబిసి గ్లోబల్‌కు చెందిన కెన్యా అనుబంధ సంస్థ కర్దా ఇంటర్నేషనల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ద్వారా ఒప్పందం చేసుకోవడం ద్వారా ఆఫ్రికా మార్కెట్‌లో విస్తరణకు వీలు కలిగిందని కెబిసి గ్లోబల్‌ పేర్కొంది.

➡️