భారత్‌లోకి ఎలన్‌ మస్క్‌ ఇంటర్నెట్‌ కంపెనీ..!

Apr 14,2024 10:34 #Business

న్యూఢిల్లీ : ఎలన్‌ మస్క్‌కు చెందిన శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల సంస్థ స్టార్‌లింక్‌ భారత్‌లో ప్రవేశానికి ప్రయత్నిస్తోందని సమాచారం. టెస్లా కంపెనీ ప్రవేశానికి అనుకూలంగా ఇటీవల కేంద్రం విద్యుత్‌ వాహనాల పాలసీని రూపొందించిన విషయం తెలిసిందే. ఇక్కడ ప్లాంట్‌ పెట్టడానికి టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ ఏప్రిల్‌ 21న భారత్‌కు రానున్నారు. టెస్లా ప్లాంట్‌ సహా స్టార్‌లింక్‌ అంశమై అధికారులతో చర్చించనున్నారు. శాటిలైట్‌ ఇంటర్నెట్‌ యూనిట్‌కు సంబంధించి లైసెన్స్‌ ప్రక్రియ ఇప్పటికే టెలికమ్యూనికేషన్స్‌ విభాగం(డిఒటి) పరిశీలనలో ఉంది. ఇటీవల శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవల కోసం లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఒఐ), ట్రయల్‌ స్పెక్ట్రమ్‌పై పని చేసేందుకు డిఒటి అనుమతులు కూడా ఇచ్చింది. స్టార్‌లింక్‌కు అనుమతులిస్తే.. ఎయిర్‌టెల్‌, జియోకు గట్టి పోటీ ఎదురు కానుంది. ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ సైతం శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల కోసం దరఖాస్తు చేసుకుంది.

➡️