లక్షద్వీప్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తొలి శాఖ ఏర్పాటు

Apr 11,2024 20:47 #Business, #hdfc bank

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ తన సేవలను లక్షద్వీప్‌కు విస్తరించినట్లు ప్రకటించింది. లక్షద్వీప్‌ రాజధాని కవరాట్టిలో తన శాఖను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. అక్కడ ఏర్పాటు చేసిన తొలి ప్రయివేటు బ్యాంకింగ్‌ శాఖ ఇదే కావడం విశేషం. ఇటీవల పర్యాటకంలో లక్షద్వీప్‌కు విశేష ప్రచారం లభించడంతో భవిష్యత్తు పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని అక్కడ కొత్త శాఖను ఏర్పాటు చేసింది.

➡️