విదేశాల్లో వ్యాపారాలకు ఓలా గుడ్‌బై..

Apr 9,2024 20:39 #Business, #ola, #overseas

బెంగళూరు : ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా క్యాబ్స్‌ ఇతర దేశాల్లోని తన కార్యకలాపాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత ఏప్రిల్‌ ముగింపునకల్లా బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని తన వ్యాపారాన్ని మూసివేయనుంది. దీనిపై అక్కడి వినియోగదారులకు సమాచారం అందిస్తోంది. పూర్తిగా భారత్‌ మార్కెట్‌పై దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఆయా దేశాల్లో ఎదురవుతున్న పోటీ నేపథ్యంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

➡️