ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్‌ రూ.2900 కోట్ల పెట్టుబడులు

May 24,2024 21:56 #Business, #flipkart, #Google

న్యూఢిల్లీ : బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో అల్పాబెట్‌కు చెందిన గూగుల్‌ 350 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2900 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. దీంతో ఫ్లిప్‌కార్ట్‌లో గూగుల్‌ మైనారిటీ వాటాను పొందనుంది. అయితే ఎంత వాటా కొనుగోలు చేసిందనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం అమెరికాకు చెందిన వాల్‌మార్ట్‌ 85 శాతం వాటా కలిగి ఉంది.

➡️