భారత వృద్థి 7 శాతంగా ఉండొచ్చు : ఎడిబిa

Apr 11,2024 20:42 #Business, #gdp, #India

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్థి రేటు 7 శాతంగా ఉండొచ్చని ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎడిబి) అంచనా వేసింది. ఇంతక్రితం 6.7 శాతం అంచనాతో పోల్చితే ఎక్కువ. ప్రభుత్వ, ప్రయివేటు రంగ పెట్టుబడులు పెరగడంతో పాటుగా వినియోగదారుల విశ్వాసంలోనూ మెరుగుదల వృద్థికి మద్దతు చేయనుందని పేర్కొంది. వచ్చే 2025-26 జిడిపి 7.2 శాతం పెరగొచ్చని తెలిపింది. 2024-25లో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ 4.6 శాతంగా, 2025-26లో 4.5 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ ఏడాది అహారోత్పత్తుల ద్రవ్యోల్బణం 5.7 శాతానికి తగ్గొచ్చని ఎడిబి పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం సూచీ 5.4 శాతంగా ఉండొచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది. మార్చి గణంకాలు వెలుపడాల్సి ఉంది.

➡️