కీలక వడ్డీరేట్లు యథాతథమే : ఆర్‌బిఐ

Jun 7,2024 10:47 #Interest rates, #RBI, #unchanged

ముంబయి : కీలక వడ్డీరేట్లను యథాతథంగా 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగించనున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. గత బుధవారం ప్రారంభమైన ద్వైమాసిక ద్రవ్యపరపతి కమిటీ విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. ఇంధన ధరల్లో ప్రతి ద్రవ్యోల్బణం నమోదవుతోందని…. అయినప్పటికీ.. ధరల పెరుగుదలపై ఎంపిసి అప్రమత్తంగా ఉందని చెప్పారు. ద్రవ్యోల్బణం, వఅద్ధి మధ్య సమతుల్యత అనుకూలంగా ఉందని తెలిపారు. ఆహార ద్రవ్యోల్బణమే కొంత వరకు ఆందోళన కలిగిస్తోందని శక్తికాంత దాస్‌ విచారాన్ని వ్యక్తం చేశారు.

➡️