రివార్డ్స్‌ సందేశాలను నమ్మకండి : ఎస్‌బిఐ హెచ్చరిక

May 20,2024 23:11 #Alert, #anounced, #fake, #massage, #SBI

ముంబయి : రివార్డ్స్‌ పాయింట్ల పేరుతో తమ బ్యాంకు ఎలాంటి లింకులూ పంపదని స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా (ఎస్‌బిఐ) తెలిపింది. ఎపికె ఫైల్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించదని పేర్కొంది. ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌లో వచ్చే లింకులను క్లిక్‌ చేయకూడదని ఖాతాదారులను హెచ్చరించింది. సైబర్‌ నేరగాల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రివార్డు పాయింట్ల పేరుతో ఎస్‌బిఐ ఖాతాదారులే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఎస్‌బిఐ పేరుతో వాట్సాప్‌లో రివార్డ్స్‌ లింక్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ‘మీ ఎస్‌బిఐ రివార్డ్స్‌ యాక్టివిటి అయింది. అది ఈ రోజు ముగిసిపోతుంది. డబ్బులు పొందేందుకు ఎస్‌బిఐ రివార్డ్స్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోండి. తద్వారా మీ ఖాతాలో డబ్బులు జమ చేసుకోండి’ అంటూ వస్తున్న తప్పుడు సందేశాలపై ఎస్‌బిఐ వినియోగదారులను అప్రమత్తం చేసింది.

➡️